పడుకుంటేనే అవకాశం ఇస్తాను అంటున్నాడు డైరెక్టర్..?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ విషయంపై ప్రతి ఒక్కరు స్పందిస్తూ నే ఉన్నారు సినీ ఇండస్ట్రీలోని నటులు. ప్రస్తుతం తాజాగా బెంగాలీ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ పాయల్ సర్కార్.. క్యాస్టింగ్ కౌచ్ విషయం పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాను ఎదుర్కొన్న కొన్ని లైంగిక సంబంధిత సంఘటన గూర్చి కూడా ప్రేక్షకులకు పంచుకుంది.తెలుగు సినిమాల ను బెంగాలీ చిత్రంలో అనువాదం చేసి విడుదల చేసే డైరెక్టర్ “రవికినాగి” ఫేస్బుక్ ఖాతా ద్వారా ఒక మెసేజ్ రావడంతో ఆరోజు రాత్రి తను ఒక్కసారిగా అవాక్కయ్యానని చెప్పుకొచ్చింది. ఆ మెసేజ్ లో ఏముందంటే..Ravi kinagi (@Ravikinagi) | Twitter

“ఒక్క రోజు రాత్రి తనతో గడిపితే.. తాను తీయబోయే సినిమాలో తనకి హీరోయిన్ గా ఆఫర్ ఇస్తానని తెలియజేశాడట.”ఈ మెసేజ్ చదివిన తర్వాత ఆమె కొద్దిసేపు అయోమయంలో పడ్డానని చెప్పుకొచ్చింది. కానీ తీరా చూస్తే అది రవికినాగి ది కాదని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాలను సృష్టించి మెసేజ్ చేశారు అని అర్థం చేసుకొని తను వెంటనే పోలీసులను ఆశ్రయించిందట.

డైరెక్టర్ రవికినాగి కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. తాను సోషల్ మీడియాలకు చాలా దూరంగా ఉంటానని తెలియజేశాడు.అంతే కాకుండా తన పేరు మీద ఎవరికైనా మెసేజ్ వస్తే పట్టించుకోవద్దని తెలియజేశాడు