బైక్‌పై ముద్దులు పెట్టుకుంటూ వెళ్తున్న ప్రేమ జంట‌..చివ‌ర‌కు..?

ఈ మ‌ధ్య కాలంలో ప్రేమ పేరుతో కొంద‌రు బ‌రితెగించి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. స‌మాజం చూస్తుంద‌న్న సిగ్గే లేకుండా..దేశ సంస్కృతిసాంప్రదాయాలు మంటగలిసిపోయేలా.. ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట రోడ్డుపై వెళ్తూ ముద్దుల ప్రపంచంలో మునిగిపోయారు.

ఈ సంఘటన బీహార రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గ‌య ప‌ట్ట‌ణలో.. వెనుక ఖాళీ ఉన్నా పెట్రోల్ ట్యాంకర్ సీట్‌పై యువతి కూర్చోగా.. యువ‌కుడు బ్రైక న‌డ‌ప‌టం స్టార్ట్ చేశాడు. అక్క‌డితో ఆగ‌ని ఆ జంట‌.. అందరూ తమను చూస్తున్నారన్న సిగ్గూఎగ్గూ లేకుండా రోడ్డుపై వెళ్తూ వెళ్తూనే ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేశారు.

అయితే చివ‌రికి దారిలో ఓ గ్రామ‌స్తుడు ఆ బ‌రితెగించిన జంట‌ను ఆపి బుద్ది చెప్పాడు. న‌డిరోడ్డుపై స‌భ్య‌త సంస్కారం లేకుండా ఏమిటీ పిచ్చి ప‌నులంటూ నిలదీశారు. దాంతో స‌ద‌రు యువ‌తి పెట్రోల్ ట్యాంక్ దిగి… వెనక ఎక్కి కూర్చి మాస్క్ పెట్టుకుంది. అలాగే స‌ద‌రు యువ‌కుడు కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు. ఇక ఈ జుగుత్సాకరమైన సంఘటన మొత్తాన్ని ఓ వ్య‌క్తి వీడియో తీసి.. సోష‌ల్ మీడియాలో పెట్ట‌గా.. ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.