త్వరలో ఓటీటీలో విడుదల కానున్న అవికాగోర్ నెట్..?

సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అవికా గోర్.. ఈమె బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల అవికా గోర్ ఒక సినిమాలో నటించింది. ఆ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తున్నారట.. ఆ విశేషాలు చూద్దాం.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా కామెడీ పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ లలో రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు. ఈ సంవత్సరం జాతి రత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన నెట్ సినిమా ఈ నెల 10వ తేదీన ఓటీటీ లో zee-5 లో విడుదల కానుంది. ఈ సినిమాని వినాయకచవితి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మల్కాపూర్, దక్షి గుత్తికొండ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారట. టెక్నాలజీ ని ఎలా వినియోగించుకోవాలి అన్న నేపధ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలా వృధాగా వాడుతున్న అటువంటి నెట్ వినియోగం వల్ల మనం చేసే చిన్న చిన్న తప్పులు, మోసాలు ఎలా జరుగుతాయో చూపించబోతున్నారు అని తెలుస్తోంది. అవికా గోర్ ఈ సినిమాతో ఓటీటీ లోకి అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తోంది.

ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవికా గోర్ తెలుగు సినిమాల వైపు మొగ్గు చూపుతోంది. ఈమె ప్రస్తుతం ఆరు సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కథ ఎన్నిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నటించిన నెట్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారట అవికాగోర్. అయితే ఈసారైనా అవికాగోర్ కు కలిసి వస్తుందో..? లేదో..? వేచి చూడాల్సిందే.