మహేష్ బాబు తో మరోసారి జతకట్టనున్న పూజ హెగ్డే..?

టాలీవుడ్ లో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరొక సినిమా. ఆ సినిమా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అలాగే టెక్నీషియన్స్ వివరాలను వెల్లడించారు. అయితే మహేష్ బాబుది ఇంతకుముందే మహర్షి వంటి సినిమాలతో జోడి కట్టిన పూజ హెగ్డే ,ఈ సినిమాలో నటించడానికి రెడీ అవుతోందట.

ఇక ఈమె తెలుగు, తమిళం వంటి పలు భాషలలో కూడా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. విజయ్ తో బీస్ట్, బాలీవుడ్ లో సర్కస్ లాంటి సినిమాలు చేస్తోంది. మరో వైపు ప్రభాస్ తో రాధే శ్యామ్ వంటి సినిమాలను చేస్తుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ డైరెక్టర్ త్రివిక్రం ఆమెను మా సినిమాలో నటిస్తారా..? అని అడగడంతో మహేష్ బాబు సినిమా కి డేట్స్ ఇవ్వడానికి రెడీగా అయిందట. తన సినిమా ఒప్పుకున్నందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ పూజా హెగ్డే కి ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట.

ఇక ఈమె ప్రస్తుతానికి తన రెమ్యూనరేషన్ 2.5 కోట్ల రూపాయలను పెంచేసింది. ఇక ప్రస్తుతానికి త్రివిక్రమ్ నిర్మాతలు ఆమెకి 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సౌత్ లో ఇంతటి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎలా నటిస్తుందో..? త్వరలోనే వెలువడే అవకాశం ఉంటుంది. మహేష్ బాబు తో ఈమె రెండవసారి జతకట్టడానికి సిద్ధం అయ్యింది.