శృతిహాసన్ కేవలం డబ్బుల కోసమే సినిమాలు తీస్తుందా..?

August 13, 2021 at 8:34 pm

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు అందులో శృతిహాసన్ ఒక టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ఏ విషయంలోనైనా తన మనసులో మాటలు చెప్తుంది. కొన్ని సందర్భాలలో ఆమె పర్సనల్స్ విషయాలను షేర్ చేసుకుంటోంది. అంతేకాకుండా తన ఆరోగ్యం గురించి కానీ తన ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఈ మధ్యకాలంలో సినిమాల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శృతిహాసన్ కి సినిమాల్లోకి రావడం అసలు ఇష్టం ఉండేది కాదట. కేవలం డబ్బు కోసమే సినిమాల్లోకి రావడానికి ఒప్పుకునేదట. రెండు సినిమాలు చేస్తే చాలు ఆపేద్దాం అనుకుంటుంది.

శృతి హాసన్ కు పాటలు పాడాలంటే చాలా ఇష్టమట. అంతేకాకుండా శృతి హాసన్ సింగర్ అని మనకు తెలిసిన విషయమే. మ్యూజిక్ కి కావాల్సిన పరికరాలకు డబ్బులు కావాలని అనుకుంటూ ఉండేది. బ్యాండ్ రిహార్సల్ కోసం డబ్బులుకావాలి..ఇంటి అద్దె కట్టాలి.. ఇలా అన్నింటికీ లెక్కలు వేసేది. ఈ లెక్కలన్నీ వేస్తూ బ్యాలెన్స్ దాచేసేదట.. డబ్బుల కోసం ఒక సినిమాలో నటిగా చేర్చాలని అనుకునేది. ఆ డబ్బు సంపాదించి తప్పు కునేది. నేను అలా అనుకుంటాను అని చెప్పింది. ఇలా కేవలం డబ్బు కోసమే సినిమాలో నటిస్తానని తెలియజేసింది. అయితే ఆమె ఎప్పుడైతే సినిమాల్లోకి వచ్చిందో సినిమాను ప్రేమించటం నేర్చుకుంది.

అయితే శృతి హాసన్ ఏ ఆలోచనతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా సరే, ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తూ ఉంటుంది..

శృతిహాసన్ కేవలం డబ్బుల కోసమే సినిమాలు తీస్తుందా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts