శ్రీదేవి డ్రామా కంపెనీ.. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో చెమటలు పట్టించిన తేజస్విని!

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఎన్నో రకాల షో లు ప్రసారమవుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎక్కువగా కామెడీ షో లు ప్రసారమవుతున్నాయి. అంతేకాకుండా ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ను కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షో లు ప్రసారం అవుతుండగా, ఈ మధ్యకాలంలో వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ షో అదే రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ షోలో సుడిగాలి సుదీర్ యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా తేజస్విని తన డాన్స్ పర్ఫార్మెన్స్ అదరగొట్టింది.

ఈ వారం ఎపిసోడ్ లో బుల్లితెర ఆర్టిస్టులు మాత్రమే కాకుండా వెండితెర ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు. ఈ వారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్ లు వరుసగా పర్ఫామెన్స్ లతో బాగా సందడి చేశారు. అలాగే సునీల్ కూడా తన డాన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. డాన్సర్ తేజస్వి మాత్రం తన హాట్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము రేపింది. మధురమే ఈ క్షణమే ఓ చెలీ.. ఆటపాటలతో సందడి చేసింది. తేజస్విని డాన్స్ పెర్ఫార్మెన్స్ నోట్లు కళ్లార్పకుండా మంది చూశారు. దీనికిసంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.