హీరోయిన్ డ్రెస్ చూసి వెంటప‌డ్డ‌ వీధి కుక్కలు..వీడియో వైర‌ల్‌!

రాఖీసావంత్.. ఈ పేరు గుర్తిండే ఉంటుంది. మొన్నీ మ‌ధ్య ఈ బాలీవుడ్ భామ త‌న‌ను ఓటీటీ బిగ్ బాస్‌కు తీసుకోవాలంటూ న‌డి రోడ్డుపై స్పైడర్ ఉమెన్ గెట‌ప్‌లో నానా ర‌చ్చ చేసి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ వెంటే విధి కుక్క‌లు వెంట‌ప‌డ్డాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

రాఖీసావంత్ చేసిన హంగామాకు బిగ్‌బాస్ వాళ్లే దిగొచ్చి.. ఆమెను షోకు ఆహ్వానించారు. దాంతో ఈ అమ్మ‌డు చూడటానికే కాదు మోయడానికి కూడా కష్టం అనిపించే ఓ భారీ గౌను వేసుకుని ఫుల్‌గా రెడీ అయ్యి వెళ్ళింది. అయితే కారు దిగి సెట్‌కు వెళ్తున్న సమయంలో రాఖీసావంత్ భారీ గౌను చూసి అక్క‌డే ఉన్న కొన్ని కుక్క‌లు ఆమె వెంట‌ప‌డ్డాయి.

అవి తనను క‌రిచేస్తాయ‌ని భయం ఉన్నా.. ఆ డ్రెస్ వేసుకుకొని పరిగెత్తలేక అలానే నడుచుకుంటూ వెళ్లిపోయింది ఈ భామ‌. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు రాఖీసావంత్ పై ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CS4lWXxnD6T/?utm_source=ig_web_copy_link