“సర్కారు వారి బ్లాస్టర్” అని ఎందుకు అన్నారంటే..?

ఆగస్టు 9 వ తేదీన సర్కారు వారి పాట చిత్ర హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని అప్డేట్లు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరించాయి.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర గ్లింప్స్, టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్లర్ల కంటే ఈ నెలలో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసే అప్డేట్ ఇంకా వీర లెవల్లో ఉంటుందని చర్చ నడుస్తోంది. అందుకే ఇందుకు సంబంధించిన అప్డేట్ న్యూస్ ను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కాగా ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తోంది. కాగా ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. ఎస్ . థమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.