రేపు బాబు ల్యాండ్ అవుతున్నాడుగా!

టాలీవుడ్ స్టార్ హీరోలను సినిమా రంగానికి చెందిన వారు బాబు అంటూ సంబోధిస్తుంటారు. ఈ అలవాటు ఎప్పటినుండో సినిమా ఇండస్ట్రీలో ఉండిపోయింది. అయితే సినీ వారసత్వ హీరోలను మాత్రమే ఇలా పిలవడం ఆనవాయతీగా వస్తూ ఉండేది. రానురాను స్టార్ హీరోలందరినీ బాబు అని పిలవడం మొదలైంది. దీంతో ఇప్పుడున్న స్టార్ హీరోలందరినీ వారి దర్శకనిర్మాతలు బాబు అని పిలవడం వెరీ కామన్. అయితే ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా మారడమే కాకుండా అందరిచేత బాబు అనిపించుకుంటున్న హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.

హృదయ కాలేయం అనే సినిమాతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా హీరోగా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ హీరో ప్రస్తుతం కామెడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా మారడమే కాకుండా వాటిని బాక్సాఫీస్ వద్ద హిట్లుగా కూడా మలుస్తున్నాడు. అయితే సంపూ నటిస్తున్న తాజా చిత్రం ‘బజార్ రౌడీ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా పోస్టర్స్ ఇప్పటికే టాలీవుడ్ జనాలను ఆకట్టుకోగా, రేపు ఉదయం బాబు ట్రైలర్‌తో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమయ్యాడు. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ యాక్షన్ మూవీగా వస్తున్న బజార్ రౌడీ చిత్రంతో సంపూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది.

ఇక ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 17న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేగాక ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే అయిన ఆగస్టు 22కు రెండు రోజుల ముందు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. మరి బజార్ రౌడీ చిత్రంతో బాబు ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే ఆగస్టు 20 వరకు వెయిట్ చేయాల్సిందే.