ఆర్ ఆర్ ఆర్ ఎలా ఉండబోతోందంటే.

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం RRR. ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటించడం విశేషం. ఇక ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ లకే పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి బొమ్మ దద్దరిల్లుతున్నట్లు సమాచారం ఇస్తున్నారు ఆ టీమ్ సభ్యులు..

ఇక ఈ మూవీలోని పోరాట సన్నివేశాలు ప్రత్యేకంగా నిలిచిపోతాయని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఇరగ తీసేశారని తెలుస్తున్నది. ఇక అంతే కాకుండా కొమరంభీం, సీతారామరాజు కలిస్తే ఏం జరుగుతుందో ..? అని సందిగ్ధం తో కథ మొదలవుతుందని తెలుస్తున్నది.

వీరిరువురు పోరాడేటటువంటి యోధులు. వీరు ఇద్దరు ఒకరికి తెలియకుండానే ఒకరు పోరాడుతూ ఉద్యమాలు చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నటువంటి వారు ఒక్కసారిగా ఇద్దరు కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే.. ఈ సినిమా కథగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ యాక్షన్ మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనే విషయం తెలియాలంటే, అక్టోబర్ 13 వరకు వేచి ఉండాల్సిందే. ఇక ప్రస్తుతం RRR లో షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈనెల 20న ఈ చిత్రం షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ మొదటి వారంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయట. ఇక సినిమాలో ఎమోషనల్ సీన్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు సమాచారం. ఇక మరొకసారి రాజమౌళి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు అని తెలుస్తున్నది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ భారీ అంచనాలను పెంచుతున్నట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నది.