96 సినిమా కాంబో రిపీట్.. మరోసారి ఆ డైరెక్టర్‌తో?

విజయ్ సేతుపతి, హీరోయిన్ త్రిష జంటగా నటించిన 96 ఈ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గోవింద మేనన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. విజయ్ సేతుపతి కెరీర్లో ఇది గుర్తుండిపోయే సినిమా. అంతేకాకుండా ఈ సినిమా లో ప్యూర్ లవ్ స్టోరీ గా జనాలను మెప్పించింది. అయితే ఈ సినిమా తరువాత మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా ద్వారానే ప్రేమ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో రీమేక్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. కాగా దర్శకుడు ప్రేమ్ కుమార్ మరొకసారి విజయ్ సేతుపతి ని డైరెక్ట్ చేయబోతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి తప్ప, అధికారికంగా ప్రకటన రాలేదు.