ఎంత సంపాదించినా కూడా కేవలం ఆటోలోనే తిరుగుతున్న ఏకైక హీరో..?

August 30, 2021 at 10:45 am

టాలీవుడ్ లో ఆర్.సత్యనారాయణ అంటే విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు.ఈయన చాలా సినిమాలు సామాన్య ప్రజల కష్టాలను, చూపించే విధంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే ఈయన గురించి పలు వార్తలు పలు రకాలుగా వెలుబడ్డాయి.దీంతో కొంతమంది అయ్యో పాపం అంటూ మరికొందరు మేము లేమా అంటూ ఆయనకు సాయం చేయడానికి సిద్ధమయ్యారు సినీ ఇండస్ట్రీలోని ప్రజలు, సామాన్య ప్రజలు కూడా.

ఇక ఆయన ఈ విషయంపై స్పందిస్తూ మీడియా ముందుకు వచ్చి నాకేం ప్రాబ్లమ్స్ లేవు అప్పులు పాలు కాలేదని తన దగ్గర సరిపడినంత డబ్బులు ఆస్తి ఉన్నాయని చెప్పారు.ఇంతకూ ఆయన ఆస్తులు పోగొట్టుకోవడం గల కారణం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో ఆయన మిత్రులతో కలిసి స్నేహ చిత్ర అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ మీద కొన్ని సినిమాలు తీయడం ద్వారా అందుకు పెట్టిన డబ్బులు రాకపోవడంతో ఆయన కొంత సొమ్మును పోగొట్టుకున్నాడు. ఉద్యమ చిత్రాలలో తను కోట్లు సంపాదించానని ఆ మొత్తాన్ని రాష్ట్రాలలోని విద్య వైద్యం రోడ్లు వేయడం లాంటి పనులు చేశానని అందుకే ఆస్తులు ఏమి కూడ పెట్టలేదు.

Actor R Narayana Murthy says aye to Jagan's decision on English Medium

కనీసం నా దగ్గర ఒక్క కారు కూడా లేదు. రవాణా సౌకర్యం అంటే ఎంచక్కా ఆటోలో ప్రయాణిస్తుంటాను. అంతేకాకుండా సినిమాలే జీవితంగా బతకాను నా కన్న తల్లిదండ్రులకు కూడా డబ్బు మీద వ్యామోహం లేదని చెప్పారు.తన తండ్రి తొంభై ఏళ్ళు బ్రతికారు నా విజయాలను అపజయాలను చూశారని చెప్పారు.తన తల్లికి తొంభై ఏళ్ళు అని తన సక్సెస్లను చూస్తూ సంతోషిస్తూ ఉంటుందని అంతే కాకుండా తను ప్రజలకు చేసే మంచి పనుల గురించి తన తల్లి చాలా సంతోషిస్తుంది అని ఆయన మాటల్లో తెలిపారు.

ఎంత సంపాదించినా కూడా కేవలం ఆటోలోనే తిరుగుతున్న ఏకైక హీరో..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts