భీమ్లా నాయక్ సౌండ్ మామూలుగా లేదుగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని పవన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పవన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ ఆదిత్య మ్యూజిక్ సంస్థకు భారీ రేటుకు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను పవన్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

కాగా ఈ సినిమాకు థమన్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్‌లో థమన్ టెర్రిఫైయింగ్ బీజీఎంకు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో మనం చూశాం. ఇక ఈ సినిమాలో థమన్ మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ పేర్కొంది. ఏదేమైనా భీమ్లా నాయక్ ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడు కావడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.