పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. మామూలుగా ఉండదట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన పవన్, ప్రస్తుతం దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహరవీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగాక ముందే దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరో సినిమా కూడా ఉంది.

అయితే పవన్ నుండి వకీల్ సాబ్ చిత్రం తరువాత ఏ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లు పెద్దగా రాకపోవడంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే షూటింగ్ తిరిగి ప్రారంభించిన అప్‌డేట్ ఒక్కటే ప్రేక్షకులకు అందించాడు పవన్. దీంతో పవన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న పవన్ నుండి ఎలాంటి పవర్‌ఫుల్ అప్‌డేట్స్ ఉంటాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈసారి పవన్ పుట్టినరోజున ఏకంగా రెండు భారీ అప్‌డేట్స్ ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పవన్ పుట్టినరోజున పవన్-రానా కాంబో మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే దర్శకుడు హరీష్ శంకర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆ రోజున రిలీజ్ చేస్తారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజున డబుల్ ధమాకా మాత్రం ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఇక ఆరోజున పవన్ అభిమానుల హంగామా ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియాలంటే సెప్టెంబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.