ఒకేసారిగా మెగా.. నందమూరి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్..

క్యూట్ హాట్ బ్యూటీ మలయాళీ హీరోయిన్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఆమె ఎవరో కాదు సంయుక్త మీనన్..ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు చేసిన ఈ అమ్మడు, ఇప్పుడు తెలుగులో అవకాశం దక్కించుకుంది. తెలుగులో ఈమె ఇప్పటికే కళ్యాణ్ రామ్ కు జోడీగా ఒక సినిమాలో నటించబోతోంది. ఇక ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది..త్వరలో విడుదలవ్వాల్సి ఉంది. ఇక సంయుక్త మీనన్ తెలుగులో మొదటి సినిమా రాకుండానే ,అప్పుడే ఈ అమ్మడు రెండవ ఆఫర్ ను కూడా దక్కించుకుంది.

సాధారణంగా ఇలా చాలా తక్కువ మంది హీరోయిన్స్ కు మాత్రమే ఈ అదృష్టం దొరుకుతుంది. మొదటి సినిమా తెరమీదకు రాకుండానే రెండవ సినిమా ఛాన్స్ వచ్చిందంటే కచ్చితంగా ఆ హీరోయిన్ భవిష్యత్తులో టాలీవుడ్ లో, బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఇక కళ్యాణ్ రామ్ తో సినిమా అతి త్వరలోనే పూర్తి అవుతుంది. విడుదల విషయమై కాస్త సమయం పట్టవచ్చు. ఇక ఈ సినిమాతో పాటు మెగాహీరో సాయిధరమ్ తేజ్ .. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాను సుకుమార్ తో కలిసి బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు.

ఇక కుమార్ రెడ్డి బ్యానర్లో వస్తున్న ప్రతి సినిమా కూడా ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఉప్పెన సినిమాతో నిర్మాత గా సుకుమార్ క్రేజ్ బాగా పెరిగింది. అందుకనే ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ వైపు పరుగులు తీస్తుంది అనే నమ్మకం కూడా ఉంది. ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక ఇటీవలే సాయి ధరమ్ తేజ్ తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభం చేశారు అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అయితే ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. స్క్రీన్ ప్లే విషయంలో సుకుమార్ సలహా సూచనలు తీసుకుంటున్నారు. ఈ సినిమా గెలుపును సొంతం చేసుకుంటుందని అంటున్నారు సాయి ధరమ్ తేజ్..ఇక తన సినీ కెరియర్లో 15వ సినిమాగా రూపొందుతోంది.

Share post:

Popular