నటుడు ప్రకాష్ రాజ్ కు గాయాలు..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంటాడు. విలనిజానికి మారుపేరు ఎవరంటే టక్కున ప్రకాష్ రాజ్ అని చెబుతారు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతి వచ్చిన తర్వాత ఈయనకి ఆఫర్లు తగ్గాయని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఆయన గాయాలపాలయ్యారు.. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రకాష్ రాజ్ ఒక సినిమా షూటింగ్ లో తన కాలికి ఫ్యాక్చర్ అయిందని , సర్జరీ కోసం తన స్నేహితుడు డా. గురువా రెడ్డి దగ్గరకు వెళుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయానా ట్విట్టర్లో తెలియజేశాడు. తన ఆరోగ్యం పట్ల అపోహలు నమ్మవద్దు. నేను ఆరోగ్యంగా ఉన్నానని తెలియజేశాడు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో అనే విషయం తెలియలేదు.

ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలియజేశారు ప్రకాష్ రాజ్ . ఇక ఈయన గాయపడ్డారనే విషయం తెలియడంతో ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్ ఎలా గాయపడ్డాడు అని పలువురు ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రకాష్ రాజ్ రంగ మార్తాండ అనే సినిమా లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. లైగర్ సినిమా లో కూడా నటిస్తున్నాడట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే మా అధ్యక్ష పదవికి కూడా పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అయితే ప్రకాష్ రాజ్ త్వరగా కోలుకోవాలని మనమందరం కోరుకుందాం. అయితే తానే స్వయంగా ఎలా జరిగిందో వెల్లడిస్తే తప్ప మనకెలా తెలుస్తుందని ఆయన అభిమానులు ఆలోచిస్తున్నారు.https://twitter.com/prakashraaj/status/1425025005641887749?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1425025005641887749%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Ftv9telugu-epaper-tvninete%2Fprakashrajprakaashraajkaalikigaayansarjirikosamhaidaraabaadraakatvitvairal-newsid-n306072886%3Fs%3Dauu%3D0xdd8c98fe8f72f8d9ss%3Dwsp