ఆర్.ఎస్.ప్రవీణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్…!

ఆరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ ప్రజల కోసం వీఆర్ఎస్ తీసుకుని పాలిటిక్స్‌లోకి వచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల బీఎస్పీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఉన్న ఆయన తెలంగాణలో ఏ మేరకు సక్సెస్ అవతారో చూడాలి. కాగా, తాజాగా ఆయన కొవిడ్ బారిన పడ్డారు. కొవిడ్ స్వల్ప లక్షణాలు కనబడగా టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ప్రవీణ్ కాక్ టెయిల్ వ్యాక్సిన్ డోస్ తీసుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇకపోతే లక్ష కంటే ఎక్కువ మంది జనం సమక్షంలో ప్రవీణ్ నల్గొండ జిల్లాలోని ఎన్జీ కాలేజ్‌లో ‘బడుగుల రాజ్యాధికార సంకల్పసభ’ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు పాజిటివ్ సోకడంతో సభలో ఆయనకు క్లోజ్‌గా వచ్చిన వారందరూ ఆందోళన చెందుతున్నారు. వారు కూడా కొవిడ్ టెస్ట్ చేసుకుంటేనే అసలు విషయం బయటకు వస్తుందని పలువురు సూచిస్తున్నారు.