”టక్ జగదీష్” రిలీజ్ పై క్లారిటీ..!

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడింది. మజిలీ, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ మాస్ ఎంటర్ టైనర్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందించారు. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. కరోనా వ్యాప్తి, ఏపీ టికెట్స్ ఇష్యూ వంటి కారణాల వల్ల రిలీజ్ విషయంలో మూవీ యూనిట్ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కాగా ప్రేక్షకులు ఎప్పట్లాగానే వస్తున్నారు. దీంతో టక్ జగదీష్ మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ సినీ వర్గాల ప్రకారం ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుందట. ప్రస్తుతం మూవీ వర్గాల్లో నాని సినిమా రిలీజ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. రిలీజ్ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.