నాగచైతన్య లక్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్ లో నాగచైతన్య అందరికీ సుపరిచితమే. ఈయన సమంతా ని వివాహం చేసుకున్న తర్వాత ఇంకా బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఈయన నటించిన లవ్ స్టోరీ సినిమా కథ తో మన ముందుకు రాబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా తోడు కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు.

ఇక నాగచైతన్య మరొక పక్క విక్రమ్ తో కలిసి తీసిన థాంక్యూ మూవీ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అమీర్ ఖాన్ తో మరో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చేశాడు నాగ చైతన్య. అలాగే తన తండ్రి నాగార్జునతో కలిసి సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ సినిమాలో ఒక పాత్రను చేస్తున్నట్లు సమాచారం.

అయితే మరొక దర్శకుడితో కూడా సినిమాను ఓకే చేసినట్లు ఎక్కువగా వినిపిస్తోంది. అతనెవరో కాదు అల్లరి నరేష్ కి సక్సెస్ ఇచ్చిన నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల. ఇక ఇటీవలే తన నుంచి ఒక కథ రావడం జరిగిందట. అది నాగచైతన్యకి ఎంతగానో నచ్చడంతో ఆ కథను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నాగచైతన్యకు ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో నాగచైతన్య ఎక్కువ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ తమ్ముడు అఖిల్ విషయంలోనే తన ఫ్యామిలీ అంతా కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లు సినీ ఇండస్ట్రీలో వినికిడి.