మళ్ళీ మొదలైంది సినిమాలో లీకైన సుహాసిని క్యారెక్టర్..

డీజే కీర్తి కుమార్ దర్శకుడిగా, కే రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం మళ్ళీ మొదలైంది. ఈ సినిమాలో హీరోగా సుమంత్ నటిస్తుండగా, హీరోయిన్ గా నైనా గంగూలి ఎంపికైనట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్.. లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ సినిమా నుంచి ఏ పోస్టర్ లీక్ కాలేదు.. కానీ ఈ చిత్రం యూనిట్ సుహాసినికి సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.. ఆ పోస్టర్ ద్వారా సినిమాలో సుహాసిని క్యారెక్టర్ గురించి వివరంగా వివరించారు.. ఇక దీని పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సుహాసిని మళ్ళీ మొదలైంది అనే సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా చిత్రం మేకర్స్ సుహాసినికి సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసారు. ఇక ఇందులో సుహాసిని ఒక ప్రముఖ వ్యాపార వేత్త గా , ఒక తల్లిగా, మానవతా దృక్పథం కలిగిన ఒక మనిషిగా సుహాసిని ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు ఈ పోస్టర్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది..

ఇక ఈ సినిమాలో ఎవరికీ తల్లిగా సుహాసిని నటిస్తుంది అనే విషయం మాత్రం చెప్పలేదు. ఏది ఏమైనా సుహాసిని ఈ సినిమాలో మరోసారి ఒక వ్యాపారవేత్తగా భిన్న కథతో ముందుకు రావడం.. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.