వామ్మో.. సుధీర్ ఇన్ని కోట్లు సంపాదించాడా?

తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లి తెర పై సుడిగాలి సుదీర్ హంగామా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా, మెజీషియన్ గా, యాంకర్ గా ఇలా వివిధ రంగాలలో ముందుకు సాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారా గత ఏడేళ్లుగా ఎంతో మంది ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నాడు. ప్రస్తుతం బుల్లితెర పై ఉన్న కమెడియన్స్ లో సుడిగాలి సుదీర్ నెంబర్ వన్ కమెడియన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

సుధీర్ నెలలో 30 రోజులు బిజీ గానే ఉంటాడు. ఇలా నెలలో 30 రోజులు బిజీగా ఉంటూ చాలా వరకు ఆస్తులు పోగేసుకున్నాడు. సుధీర్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఇలా ఉంటే బుల్లితెరపై ఎన్నో రకాల షో లలో చేస్తున్న సుధీర్ అదేవిధంగా సంపాదించి ఉంటాడు.  సుధీర్ అభిమానులు సుధీర్ ఎంత సంపాదించాడు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి తాపత్రయ పడుతుంటారు. సుధీర్ సంపాదించిన ఆస్తి మొత్తం అంతా లెక్కపెడితే దాదాపుగా ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంతేకాకుండా ఏడాదికి 35 నుంచి 45 లక్షలు సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా హైదరాబాద్ లో రెండు సొంత ఇల్లు ఉన్నాయి అని ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో సుధీర్ చెప్పుకొచ్చాడు.