వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న..అలనాటి అందాల నటుడు మనవడు?

సినీ ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీని తీసుకున్నా కూడా అన్నీ ఇండస్ట్రీలలో వారసత్వమే కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ వారసుల హవా నడుస్తోంది. ఒకప్పటి అన్న తెలుగు సంపాదించినా పాపులారిటీ తో ఆ తరువాత వారి వారసత్వంగా కొనసాగిస్తూ వారి వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. వారసులు కొంచెం పెద్దవారు అవ్వగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది వారి తండ్రులు అలాగే తాతలు సంపాదించిన ఇమేజ్ ను ఇన్వెస్ట్ చేసి హీరోలుగా రాణిస్తున్నారు. అయితే తాజాగా అలనాటి అందాల నటుడు హరనాథ్ మనవడు టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

విరాట్ రాజ్ అలనాటి అందాల నటుడు హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనవడు. ఇతను ప్రస్తుతం సీతామనోహర శ్రీరాఘవ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ రోజు విరాట్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా అసలు నువ్వు విడుదల చేశారు. ఇందులో హ్యాండ్సమ్ పర్సనాలిటీతో నటుడు హరనాథ్ గుర్తుకు వచ్చేలా విరాట్ రాజ్ ఆహ్యర్యం ఉంది. ఈ సినిమాకు దుర్గా శ్రీ వత్సస దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతోందని సినిమా దర్శకుడు తెలిపారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్ రుర్ సంగీతాన్ని అందిస్తున్నారు.