హరిహర వీరమల్లు సినిమా నుంచి మరో సరికొత్త అప్డేట్ రానుందా?

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పీరియాడికల్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను ఎ ఎం రత్నం సమర్పణలో పాన్ ఇండియా రేంజ్ లో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతేకాకుండా దర్శకుడు క్రిష్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి మంచి ఎగ్జైట్ అప్డేట్స్ వచ్చాయి. మరో కొన్ని రోజుల్లో మరో స్పెషల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ 2వ తేదీన పవన్ బర్త్ డే సందర్భంగా ఒక అదిరే పోస్టర్ ను లాంచ్ చేయనున్నట్టు గా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రం సంబంధించిన సరికొత్త రిలీజ్ డేట్ ను కూడా అందులో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.