మళ్ళీ ట్రోల్ అవుతున్న శ్రీముఖి.. ఈసారి కారణం ఏంటంటే?

శ్రీముఖి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అంతేకాకుండా ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై ఎన్నో అవకాశాలను అందుకుంది.అలాగే యాంకర్ లలో సుమ తరువాత అందటీ పాపులారిటీని సంపాదించుకుంది శ్రీముఖి. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గా ఉంటూ ప్రతి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంటుంది.

అయితే నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా ఆ ఫోటోలు కాస్తా నెటిజన్స్ తో ట్రోలింగ్స్ చేయించుకునే వరకు వెళ్లాయి. తాజాగా శ్రీముఖి ప్యాంటు లేకుండా రోడ్డుపై దిగిన ఫొటోస్ ని షేర్ చేసుకోగా ఏంటిది శ్రీముఖి అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకొందరు శ్రీముఖి అందాలకు ముగ్ధులై లైక్స్ కామెంట్స్ తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.