ల‌క్ అంటే వీడిదే..తాగిన బార్ నుంచి రూ.40 కోట్లు కొట్టేసిన మందుబాబు!

అదృష్టం ఎప్పుడు ఎవ‌ర్ని ఎలా వ‌రిస్తుందో ఊహించ‌డం చాలా క‌ష్టం. అయితే ఆ అదృష్ట‌మే తాజాగా ఓ పచ్చి తాగుబోతుకు రూ.40 కోట్ల‌ను తెచ్చిపెట్టింది. అది కూడా అత‌డు తాగే బార్ నుంచే అంత మొత్తం డ‌బ్బును అందుకున్నాడు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. టెక్సాస్‌కు చెందిన డానియల్‌ రాల్స్ అనే వ్య‌క్తి ఓరోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్‌ గ్రిల్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఫుల్‌గా మ‌ద్యం సేవించాడు.

ఆపై కార్‌ పార్కింగ్‌ దగ్గర ఓ వ్యక్తితో గొడవకు దిగ‌గా.. ఆ ఘర్షణలో రాల్స్‌ తలకు తీవ్ర గాయం అయ్యింది. దాంతో హాస్ప‌ట‌ల్‌లో జాయిన్ అయిన రాల్స్ కొన్ని రోజుల‌కు కోలుకున్నాడు. అయితే కోలుకున్న వెంట‌నే రాల్స్‌.. కోర్టులో తాను మ‌ద్యం సేవించిన బార్‌ మీద కోర్టులో కేసు వేశాడు. ఆ బార్ నిర్వాహ‌కుల వల్లే తాను ఓవ‌ర్‌గా తాగానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని రాల్స్‌ ఆరోపించాడు.

పైగా ఘర్షణ టైంలోనూ బార్‌ నిర్వాహకులు చూసి చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌ని, తాను గాయపడ్డాక కనీసం ఆంబులెన్స్‌ను కూడా పిలవలేదని ఆరోప‌ణ‌లు చేస్తూ.. బార్‌ ఓనర్‌తో పాటు తనకు సర్వ్‌ చేసిన బార్‌టెండర్‌ను నిందితులుగా పేర్కొన్నాడు. మ‌రోవైపు బార్ ఓన‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది గ‌ట్టిగానే వాదించినా ఫ‌లితం లేక‌పోయింది. కోర్టు రాల్స్‌కే అనుకూలంగా తీర్పును ఇచ్చింది. బార్ ఓవ‌ర్ రాల్స్‌కు 5.5 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం ఇవ్వాల‌ని కోర్టు తేల్చింది. మొత్తానికి అలా తాగిన బార్ నుంచే లార్స్ రూ.40 కోట్ల‌ను ఫ్రీగా కొట్టేశాడు.