బ‌న్నీతో అలాంటి మూవీ చేయాలి..మారుతి కామెంట్స్ వైర‌ల్‌!

చేసింది త‌క్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ద‌ర్శ‌కుడు మారుతి. ప్రస్తుతం ఆయన గోపిచంద్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రం చేస్తున్నారు. దీంతో పాటుగా సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధగా ఉన్నాయి.

ఇదిలా ఉండే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మారుతి ఎన్నో ఆస‌క్తికర విష‌యాలు పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న మ‌న‌సులోని కోరిక‌ను కూడా బ‌య‌ట పెట్టాడు. ఇంత‌కీ ఆయ‌న కోరిక ఏంటంటే.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో అల్లాద్దీన్ లాంటి సినిమా చేయాల‌న్న‌దే మారితి కోరిక‌ట‌.

ఎందుకంటే ఆయ‌న‌కు యానిమేషన్‌ అంటే ఎంతో ఇష్టమ‌ట‌. బొమ్మలు కూడా బాగా గీస్తార‌ట‌. అందుకే అలాంటి సినిమాను బ‌న్నీతో చేయాల‌ని ముచ్చ‌ట‌ప‌డుతున్నార‌ట‌. మ‌రి మారుతి కోరిక తీరుతుందో..లేదో..చూడాలి. కాగా, బ‌న్నీ, మారుతి మంచి స్నేహితులు. ఈ నేప‌థ్యంలో గ‌తంలో వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అది జ‌ర‌గ‌లేదు.