బిగ్ బాస్ కోసం స్పైడర్ వుమన్ గెటప్ లో నటి.. !!

రాఖీ సావంత్ అనే పేరుకి పరిచయాలు అక్కర్లేదు అనే చెప్పాలి. ఎప్పుడు ఎవరితో ఒకరితో వివాదాలు పడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మధ్య కాస్త సైలెంట్ గానే ఉన్నా మళ్ళీ ఇప్పుడు తనని బిగ్ బాస్ 15 ఓటిటీ సీజన్ లోకి తనని ఆహ్వానించాలంటూ నడి రోడ్డుపై స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని నేను స్పైడర్ మాన్ కాదు నేను స్పైడర్ వుమన్ అంటూ రోడ్డుపై డాన్సులు వేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

తనకి బిగ్ బాస్ షో అంటే ఎంతో ఇష్టమని కానీ నన్ను ఎందుకు బిగ్ బాస్ షో లోకి ఆహ్వానించడం లేదు అని అన్నారు. తనని బిగ్ బాస్ 15 ఓటీటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై స్పైడర్ ఉమెన్ డ్రెస్ వేసుకుని నిరసన వ్యక్తం చేసింది. సిద్ధార్థ్ శుక్లా, షెహ్నాజ్ గిల్ లను ఆహ్వానించిన వారు నన్ను ఎందుకు పిలవలేదు అని ప్రశ్నించింది.కరణ్ జోహార్ ఈ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కు సంబందించి వోట్‌ జరుగుతుండగా రాఖీ ఇలా చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.