బాలయ్య సినిమాలే కాదు.. కారు కూడా స్పీడే!

నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఎలాంటి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్ంటారు. రొటీన్ సినిమాలను కూడా బాలయ్య తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటం, వాటిలో బాలయ్య డైలాగులు, యాక్షన్ సీన్స్ చూసి ఎంజాయ్ చేసేందుకు జనాలు థియేటర్లకు క్యూ కడుతుంటారు. అయితే బాలయ్య సినిమాలు ఏ రేంజ్‌లో స్పీడుగా పూర్తి చేస్తారో మనకు తెలిసిందే.

కానీ బాలయ్య ఒక్క సినిమాలే కాకుండా చాలా విషయాల్లో స్పీడు అని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా కారు డ్రైవింగ్‌లో బాలయ్య స్పీడు చూస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. అవును.. తాజాగా బాలయ్య స్వయంగా తన కారును నడుపుతున్న వేగాన్ని చూసి అందరూ షాకవుతున్నారు. 120-140 కిమీ స్పీడులో బాలయ్య తన కారును అలవోకగా ఎంజాయ్ చేస్తూ మరీ నడుపుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అందుకే అంటారు బాలయ్య వేగం ముందు ఎవరూ ఎదురుపడ్డా వారికి ప్రమాదమని. అది సినిమాలైనా, రాజకీయమైనా అని అభిమానులు అంటుంటారు. కానీ ఇప్పుడు బాలయ్య కారు వేగం ముందు కూడా ఎవరూ ఎదురపడ్డా వారికి ప్రమాదమే అంటున్నారు బాలయ్య అభిమానులు. కానీ బాలయ్య కారును వేగంగా కాకుండా జాగ్రత్తగా నడిపాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.