101 జిల్లాల అందగాడిని నేనే : అవసరాల

అవసరాల శ్రీనివాస్… ఈ పేరు మన అందరికి సుపరిచితమే. ఒక పక్క న‌టుడిగా నటిస్తునే మరోపక్క ద‌ర్శ‌కుడిగా సినిమాలు తీసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు  అవసరాల శ్రీనివాస్‌ త్వరలో  101 జిల్లాల్లో కెల్లా అందగాడిని నేనే అంటూ హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ సినిమా ఆగ‌స్ట్ 27న విడుదలకు సిద్ధం అయినది.చూస్తుంటే ఈ సినిమాలో కామెడీ మాములుగా ఉండదేమో అనిపిస్తుంది.

ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ ఒక బట్టతల ఉన్న యువకుడి పాత్రలో నటించారట.ఇకపోతే శ్రీనివాస్ కి జోడిగా చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. నటిస్తోంది.అలాగే అవసరాల నటించగా,ఈ చిత్రం ద్వారా రాచకొండ విద్యాసాగర్‌ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై  ‘దిల్‌’ రాజు, డైరెక్టర్‌ క్రిష్‌ సమర్పణలో శిరీష్, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా 101 జిల్లాల అందగాడు సినిమాను నిర్మిస్తున్నారు. !