పుష్పరాజ్ బలం ఏమిటో గమనించారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప-ది రైజ్’ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దాక్కొ దాక్కొ మేక’ అనే యూట్యూబ్‌ను దున్నేస్తూ సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. పూర్తి మాస్ అవతారంలో బన్నీని చూసిన ఆడియెన్స్ పూర్తిగా థ్రిల్ అవుతున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ సాంగ్‌ను వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, లిరికల్ సాంగ్‌లను గమనిస్తే మనకు ఓ విషయం అర్థం అవుతుంది. ఈ సినిమాలో పుష్ప రాజ్ ఎడమచేతి వాటం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు. మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయాన్ని మీరు గమనించగలరు. తాజాగా రిలీజ్ అయిన లిరికల్ సాంగ్‌లో కూడా ఆయన ఎడమ భుజాన్నే ఎగురవేస్తూ కనిపిస్తాడు. అలాగే ఫస్ట్ గ్లింప్స్ టీజర్‌లో కూడా తగ్గేదే లే అనే డైలాగును ఎడమచేత్తో గడ్డాన్ని నురుముతూ అంటాడు.

అంతేగాక గతంలో రిలీజ్ అయిన ఓ పోస్టర్‌లో కూడా పుష్పరాజ్ ఎడమచేతిలో గొడ్డలి పట్టుకుని కూర్చుంటాడు. ఇలా ఏ విధంగా చూసినా ఈ సినిమాలో పుష్పరాజ్ ఎడమచేతి వాటం ఉన్న వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. మీరు ఈ విషయాన్ని నమ్మకపోతే మరోసారి ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, లిరికల్ సాంగ్‌ను చూడండి. మీకే తెలుస్తుంది!