విష్ణు ప్రియకి అలాంటి భర్త కావాలట..!

షార్ట్‌ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ పై తెలుగు బుల్లితెరపై యాంకర్‌ గానూ తన సత్తా చాటుతూ దూసుకు వెళుతుంది. ఇందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ – విష్ణుప్రియ తో చేసిన పోరా- పోవే షోతో బాగా పాపులర్‌ అయిన ఆమె.. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తుంది. వితోపాటు ఇంకోవైపు యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇంకా చెప్పాలంటే లాక్‌ డౌన్‌ సమయంలో కూడా తన స్నేహితురాలు, యాంకర్‌ శ్రీముఖితో కలిసి అనేక వీడియోలు చేస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తూ అలరించింది. ఇక స్కిన్‌ షో విషయానికొస్తే.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో రెచ్చి పోతుంటుంది.

తాజాగా సోషల్ మీడియా యూజర్లతో ముచ్చటించిన విష్ణుప్రియ..తన కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ ఓ పోస్టును షేర్‌ చేసింది. తనకి ఆషికి-2 సినిమాలో హీరో ఆదిత్యరాయ్‌ కపూర్‌ లాంటి వ్యక్తి భర్తగా రావాలని, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఇలాంటి వ్యక్తిని భర్తగా ప్రసాదించు దేవుడా అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది విష్ణు. దీంతో విష్ణు చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ గా మారాయి. దీంతో నెటిజన్లు ‘వచ్చే జన్మదాకా ఎందుకు..? ఈ జన్మలోనే నువ్వు కోరుకున్న వ్యక్తి దొరుకుతాడులే’ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.