టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చేయనవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఆయన ఎన్నో వందల సినిమాలలో నటించారు. అలీ కమెడియన్ గా, హీరోగా.. నటించి ఎందరో ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందాడు. ఇక ఈ సంగతి పక్కనపెడితే.. ఇటీవల కాలంలో ప్రతిఒక్కరూ ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు తాజాగా అలీ కూడా ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టాడు.
ఈ విషయాన్ని తాజాగా ఆయన చెబుతూ.. “ఇదే నా అధికారిక ఖాతా అంటూ.. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాలోని నా గుండె చిక్కుకుంది అనే పాట లోని స్టిల్ ఇది అంటూ ఓ ఫోటోని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు అలీ.