హైదరాబాద్‌లో జ్యూస్ అమ్మిన సోనూసూద్‌..వీడియో వైర‌ల్‌!

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంద‌రికో త‌న‌వంతు సాయం చేస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్న న‌టుడు సోనూసూద్‌.. ఇప్పటికీ తన సేవాకార్య‌క్ర‌మాల‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే మ‌రోవైపు కొత్త కొత్త‌గా వ్యాపారాలు కూడా మొదలు పెడుతున్నాడు. అయితే, ఇవి తన సొంత లాభం కోసం కాదు.

కరోనా కారణంగా తీవ్రంగా నష్టాల పాలైన చిరు వ్యాపారులకు మద్దతు ఇస్తూ.. ఆయన ఓ చిరు వ్యాపారిగా మారిపోయారు. ఈ మ‌ధ్య గుడ్లు, బ్రెడ్ వంటివి అమ్మిన సోనూసూద్‌.. ఇటీవ‌ల రోటీలు చేసి అమ్మాడు. ఇక తాజాగా సోనూ కొత్త అవతారం ఎత్తాడు. ఈసారి జ్యూస్‌ షాప్‌ ఓనర్‌గా మారిపోయి.. జ్యూస్ అమ్మాడు.

హైద‌రాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్3 లో రోడ్డు పక్కన ఉన్న జ్యూస్ షాపు వద్దకు వెళ్లిన సోనూ.. స‌ద‌రు షాప్ ఓన‌ర్‌తో స‌ర‌దాగా ముచ్చ‌ట్లు పెట్టారు. అనంత‌రం స్వ‌యంగా బత్తాయి జ్యుస్ ను చేసుకొని తాగారు. అలాగే ఇందుకు సంబంధించిన వీడియో సోస‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దాంతో ఈయ‌న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://twitter.com/SonuSood/status/1419972472477077505?s=20