రుమేర్స్ కి చెక్ పెట్టిన హీరో సిద్ధార్థ్…?

సోషల్ మీడియా ఓ పవర్ ఫుల్ వెప్పన్ లాంటిది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు మంచికి, చెడుకు రెండింటికీ సోషల్ మీడియా తోపే. ఒక్క రోజులోనే స్టార్ డమ్ ని తెచ్చిపెడుతుంది.. ఒక్కరోజులోనే పైన ఉన్న వాళ్ళని పాతాళానికి తొక్కేస్తుంది. బతికున్న వాళ్ళని చంపేస్తుంది..లేని వాళ్ళని సృష్టింది. ఇలా సోషల్ మీడియా పుట్టించిన ఓ వార్తకు ప్రముఖ హీరో చాలా హర్ట్ అయ్యాడు. ఏకంగా తాను చనిపోయాను అని వచ్చిన వార్తను చూసి స్టన్ అయ్యాడు. సోషల్ మీడియా చంపేసింది మరెవరినో కాదు, ఒకప్పుడు వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న సిద్దార్ద్ ని. విషయం ఏమిటి అంటే.

చిన్న వయసులోనే మరణించిన 10 మంది దక్షిణాది తారలు వీళ్ళే పేరుతో ఓ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో చేశారు. అందులో సౌందర్య, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ లాంటి దివంగత తారలతో పాటు సిద్ధార్థ్‌ను కూడా చేర్చారు. ఇది చూసిన ఓ అభిమాని సిద్ధార్థ్‌కు ట్యాగ్ చేసాడు. వెంటనే హీరో సిద్దార్థ్ సీరియస్ అయ్యాడు. వ్యూస్ కోసం ఏమైనా చేస్తారా..ఎవర్నైనా చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను చనిపోయానంటూ వీడియోలు పెడుతున్నారని యూ ట్యూబ్‌కి సిద్దార్థ్ ఫిర్యాదు చేశాడు.