రాజ్ కుంద్రా కేసుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్‌!

పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు రోజుకో మ‌లుపు తిరుగుతూ.. వార్త‌లు హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా రాజ్ కుంద్రా అరెస్ట్, పోర్నోగ్రఫీ ఇష్యూపై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఓ ఇంట‌ర్యూలో పాల్గొన్న ఆర్జీవీ..ఇద్దరికీ ఇష్టమైనప్పుడు శృంగారం చేయడం తప్పు కాదని, ఆ ఇద్దరి అంగీకారంతో వేరొక వ్యక్తి షూట్ చేయడంలోనూ తప్పు లేదనేది, అదే బలవంతంగా చేస్తే ఖచ్చితంగా తప్పు అని త‌న భావ‌న వ్య‌క్తం చేశారు. యూట్యూబ్ లో వందల, వేల పోర్న్ రిలేటెడ్ వీడియోలు ఉన్నాయని.. అవన్నీ బయటకు తీస్తే చాలామందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వ‌ర్మ చెప్పుకొచ్చాడు.

అలాగే పోర్నోగ్రఫి చూసినంత మాత్రాన సమాజంలో దారుణాలు జరుగుతాయని అనుకోవడం పొర‌పాట‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇక రాజ్ కుంద్రా అనేవాడు శిల్పా శెట్టి భర్త, పైగా ప్రముఖ వ్యాపారవేత్త. కాబట్టి, అత‌డి కేసు వార్త‌ల్లో బాగా హైలైట్ అవుతుంద‌ని వ‌ర్మ తెలిపాడు. దాంతో ప్ర‌స్తుతం వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.