నా స‌క్సెస్ సీక్రెట్ అదే అంటున్న ప్రియ‌మ‌ణి!

ప్రియ‌మ‌ణి..ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్రముగ్దులను చేసే ఈ భామ‌.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మ‌రింత జోరుగా దూసుకుపోతోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గుడుపోతంది.

Narappa On Amazon Prime Video: Who Is The Biggest Loser?

ఇటీవ‌లె ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సుచిత్రగా ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్న ప్రియ‌మ‌ణి… ఇప్పుడు నార‌ప్ప సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 20న నార‌ప్ప విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌మ‌ణి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో సూపర్‌ సక్సెస్‌ కు సీక్రెట్‌ ఏంటో బ‌య‌ట పెట్టింది.

Chennai Express star Priyamani gets married to Mustafa Raj. See pictures, video - Hindustan Times

సినిమా అయినా, వెబ్ సిరీస్‌ అయినా, ఆఖరికి యాడ్‌ ఫిలిం అయినా.. తన భర్త ఓకే చేసిన త‌ర్వాతే నటిస్తున్నారట ప్రియమణి. ఆయన స్టోరి సెలక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంద‌ట‌. అందుకే ఆయ‌న ఓకే చేసిన క్యారెక్ట‌ర్స్‌నే చేస్తాన‌ని, అదే త‌న స‌క్సెస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చింది ప్రియ‌మ‌ణి. అలాగే త‌న భ‌ర్త స‌పోర్ట్ వ‌ల్లే పెళ్లి త‌ర్వాత కూడా స్టార్ స్టేట‌స్ ద‌క్కింద‌ని డస్కీ బ్యూటీ పేర్కొంది.