నానితో న‌టించాల‌నుంది అంటున్న‌ వెంక‌టేష్‌ త‌న‌యుడు!

కార్తీక్ రత్నం.. అదేనీండీ నార‌ప్ప సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్‌కు త‌న‌యుడుగా న‌టించిన మునికన్న `కేరాఫ్ కంచరపాలెం` సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్ట‌డ‌మే కాదు.. మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత అర్థ శతాబ్దంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కార్తీక్ ర‌త్నం.. నార‌ప్ప సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఈ చిత్రంలో కార్తీక్ ర‌త్నం త‌న‌దైన‌ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో నార‌ప్ప షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ఎన్నో విష‌యాలు పంచుకున్నారు. అలాగే వెంకీ ఓ గొప్ప న‌టుడ‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు.

ఇక త‌న‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని అన్నా, ఆయ‌న న‌ట‌న అన్నా ఎంతో ఇష్ట‌మ‌ని కార్తీక్ ర‌త్నం చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆయ‌నతో కలిసి ఒక్క సీన్ అయినా నటించాల‌నుంది అంటూ మ‌న‌సులో ఉన్న కోరిక‌ను కూడా బ‌య‌ట పెట్టేశాడు. మ‌రి మ‌న మునిక‌న్న కోరిక ఎప్ప‌టికి తీరుతుందో చూడాల్సి ఉంది.