హీరో అజిత్ ఇంట్లో బాంబ్ పెట్టామంటూ బెదిరింపులు..చివ‌ర‌కు..?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న‌కు త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోంగ్ ఉంది. ఈ క్ర‌మంలోనే అజిత్ సినిమాలు తెలుగులోకి కూడా రీమేక్ అవుతూ ఉంటాయి.

ఇదిలా ఉంటే.. సినీ తార‌ల‌ ఇంటికి బాంబు బెదిరింపులు రావడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైపోయాయి. తాజాగా అజిత్ ఇంటికి కూడా ఇలాంటి బెదిరింపులే వ‌చ్చాయి. చెన్నైలోని ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేశారు. దీంతో, ఈ కాల్ కు సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసుల జాగిలాలతో వచ్చి ఇల్లు మొత్తం తనిఖీ చేశారు. బాంబు కనిపించకపోవడంతో… చివ‌ర‌కు అది ఉత్తుత్తి కాల్ అని నిర్ధారణకు వచ్చారు. ఈ క్ర‌మంలోనే కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ఆ కాల్ నంబర్ ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో ప‌డ్డారు.