నాని చాలా ఏడిపించాడు..బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌న్ను ఏడిపించాడంటూ బాలీవుడ్ పాపుల‌ర్‌ హీరో షాహిద్‌క‌పూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..నాని, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డ‌మే కాదు.. న‌ట‌నాప‌రంగా నానిని మ‌రో మెట్టు ఎక్కిచింది.

ఈ హిట్ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతుంది. గౌతమ్ తిన్ననూరినే రీమేక్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. నాని పాత్ర‌లో షాహిద్ క‌పూర్ న‌టిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఇన్‌స్టా లైవ్ లో ఈ సినిమాను గురించి షాహిద్ కపూర్ మాట్లాడాడు. జెర్సీ సినిమా చూస్తున్న‌పుడు నాని త‌న న‌ట‌న‌తో న‌న్ను నాలుగైదు సార్లు ఏడిపించేశాడు.

Shahid Kapoor exudes 'laid back vibes' over weekend in latest Instagram  post- The New Indian Express

నాకు 40 ఏళ్లు.. జీవితంలో ఆలస్యంగా సక్సెస్‌ అందుకోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా చాలా ఆలస్యంగా సక్సెస్‌ అందుకున్నవాడినే. నా మనసుకు బాగా దగ్గరైందీ చిత్రం. ఎలాంటి కథలను ఎంచుకోవాలనేది నాకు ఈ సినిమా చూసిన తరువాతనే అర్థమైంది అని షాహిద్ క‌పూర్ చెప్పుకొచ్చాడు.