క్రికెట్ నుండి ఇంగ్లాండ్ ప్లేయర్ సస్పెండ్..!

తాజాగా క్రికెట్ లో ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు నుండి అరంగేట్రం చేసి తనదైన ముద్ర వేసుకున్న ఫేస్ బౌలర్ ఓలి రాబిన్సన్. అతడు అంతర్జాతీయ మ్యాచులలో అడుగు పెట్టక ముందు సోషల్ మీడియాలో మహిళల పట్ల వివక్షత పూరిత కామెంట్ చేయడం, అలాగే జాతివివక్ష లాంటి వాటిపై పెద్ద ఎత్తున కామెంట్లూ చేశాడని అతనిపై చట్టరీత్య చర్య తీసుకున్నారు. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు 2012 సంవత్సరానికి సంబంధించిన విషయం.

అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విచారణ కోర్టులో జరుగుతోంది. దాంతో ఈ విచారణ పూర్తయ్యేంతవరకు రాబిన్ సన్ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడే అవకాశం కోల్పోయాడని తాజాగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ తెలియజేసింది.