నానిపై మ‌హేష్ ప్ర‌శంస‌లు..కార‌ణం అదే!

న్యాచుర‌ల్ స్టార్ నానిపై సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్ తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ‌హేష్ నానిని ప్ర‌శంసించేందుకు కార‌ణం ఏంటీ..? అన్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. అక్క‌డికే వ‌స్తున్నా..క‌రోనా రోగుల కోసం త‌మ ప్రాణాల‌ను రిస్క్‌లో పెట్టి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి ట్రిబ్యూట్‌గా నాని, సత్యదేవ్‌ అంట్‌ టీమ్‌ కలిసి దారే లేదా పేరుతో ఓ స్పెషల్‌ వీడియో సాంగ్ చేశారు.

ఈ మ్యూజికల్ వీడియోలో సత్యదేవ్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ రూప నటించారు. కేకే రాసిన ఈ పాటను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని సమర్పించాడు. తాజాగా విడుద‌లైన ఈ వీడియో సాంగ్.. అంద‌రి హృదయాలను కట్టిపడేస్తుంది. ఇక తాజాగా ఈ వీడియోపై మహేష్‌ బాబు కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

కరోనా ఆపత్కాల సమయంలో సేవ చేసిన ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌ని గౌరవించేందుకు మంచిదారి ఎన్నుకున్నారు. విశాల హృదయంతో చేసిన ఈ వీడియో చూసి.. నా హృదయం కూడా సంతోషంతో నిండిపోయింది. నాని అండ్‌ టీమ్‌ అద్బుతమైన పనితనాన్ని ప్రదర్శించారు అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

https://twitter.com/urstrulyMahesh/status/1406197907804409856?s=20