అనన్య నాగళ్ల.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మల్లేశం సినిమాతో హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య.. ఆ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
ఇక ఈ మధ్య ఆహాలో విడుదలైన ప్లే బ్యాక్ చిత్రంలోనూ అనన్య అదరగొట్టింది. అయితే అన్ స్క్రీన్ పై ఎంతో పద్ధతిగా కనిపించిన అనన్య.. అఫ్ స్క్రీన్‌లో మాత్రం అందాల ఆరబోతతో రచ్చ రేపుతోంది. సోషల్ మీడియా ద్వారా హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ.. ఫాలోవర్స్‌ను నిత్యం ఎంటర్‌టైన్ చేస్తోంది.
తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రస్ ధరించి పార్క్‌లో పరువాలు ఒలకబోస్తూ.. ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక అనన్య సోయగాలకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు.