ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. నిన్న కూడా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా తగ్గాయి.
గత 24 గంటల్లో భారత్‌లో 58,419 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,81,965 కు చేరుకుంది. అలాగే నిన్న 1,576 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,86,713 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 87,619 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 2,87,66,009 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 7,29,243 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. నిన్నొక్కరోజే 18,11,446 కరోనా టెస్ట్‌లు నిర్వహించారు.