కాజ‌ల్ డేరింగ్ స్టెప్‌..నాగ్ మూవీలో చంద‌మామ షాకింగ్ రోల్‌?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఇటీవ‌లె గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను ఏ మాత్రం డ‌ల్ అవ్వ‌నివ్వ‌కుండా.. వైవిద్య‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది.

ప్ర‌స్తుతం కాజల్ న‌టిస్తున్న సినిమాల్లో నాగార్జున సినిమా ఒక‌టి. ప్రవీణ్ సత్తారు ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజ‌ల్ షాకింగ్ రోల్ పోషిస్తుందంటూ ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో కాజల్ స్పై పాత్రలో నటిస్తుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే ఆమె పాత్రలో మరో వేరియేషన్ కూడా ఉంటుందని టాక్ న‌డుస్తోంది. అదే వేశ్య.. అవును సినిమాలో ఈమె ఎక్కువ భాగం వేశ్యగా.. చివర్లో మాత్రం స్పైగా కనిపించబోతుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి కాజ‌ల్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వేశ్య పాత్ర‌లో న‌టించింది లేదు. కానీ, ఇప్పుడు.. అది కూడా పెళ్లి త‌ర్వాత అలాంటి పాత్ర‌లో న‌టించ‌డ‌మంటే కాజ‌ల్ డేరింగ్ స్టెప్ తీసుకున్న‌ట్టే అవుతుంది.