బాలీవుడ్ బ్యూటీకి వేధింపులు.. చేదు అనుభవం

బాలీవుడ్ లో వీర్, హౌస్ ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2, 1921, హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జరీన్ ఖాన్. ఈమె తెలుగులో గోపిచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో కూడా నటించింది. అయితే గతంలో తనకు ఓ చేదు అనుభవం ఎదురైన విషయాన్ని ఈ హీరోయిన్ తాజాగా బయటపెట్టింది. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుందని చాలా మందికి తెలిసిందే. అయితే తాజాగా తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఓ బాలీవుడ్ మీడియాతో జరీన్ ఖాన్ ఇలా చెప్పుకొచ్చింది.

తాను సినిమాల్లో అవకాశాల కోసం తిరిగేటప్పుడు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడని, ఆ వ్యక్తి ప్రపంచంలో అతడి కంటే గొప్ప వ్యక్తులెవరూ లేనట్లుగా ప్రవర్తించేవాడని చెప్పింది. తాను ఓ సినిమాలో కిస్సింగ్ సీన్ లో నటించాల్సి ఉండగా.. కిస్సింగ్ సీన్ రిహార్సల్స్ పేరుతో సదరు వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, తనతో మరీ దారుణంగా ప్రవర్తించేవాడని చెప్పుకొచ్చింది. తనతో ఆ వ్యక్తి మిస్ బిహేవ్ చేసేవాడని, ఇండస్ట్రీకి తాను కొత్త కావడంతో సర్దిచెప్పుకుని ఊరుకున్నట్లు చెప్పింది.