వెంక‌టేష్‌కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే మ‌తిపోవాల్సిందే!?

ప్ర‌ముఖ నిర్మాత డి.రామానాయుడు త‌న‌యుడుగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టినా.. సొంత ట్యాలెంట్‌తో స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు విక్ట‌రీ వెంక‌టేష్‌. కలియుగ పాండవులు నుండి నారప్ప వరకు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన‌ వెంకీకి 80 శాతం సక్సెస్ రేట్ ఉంది.

ఇక ప్ర‌స్తుతం వెంకీ హీరోగానే కాకుండా.. ప‌లు వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మ్యాన్‌గా కూడా దూసుకుపోతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఎన్నో ఆస్తుల‌ను కూడా కూడ‌బెట్టుకున్నారు. అధికారిక లెక్క‌లు బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ట్రేడ్ పండితుల లెక్క‌ల ప్ర‌కారం వెంకీ ఆస్తి విలువ దాదాపు 2200 కోట్ల వరకు ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు.

అయితే ఈ ఆస్తులు వెంకీ సొంతంగా సంపాదించుకున్న‌వే. తన తండ్రి నుండీ వెంకీకి వచ్చిన ఆస్తులు ఇంకా చాలానే ఉన్నాయ‌ని అంటున్నారు. కాగా, వెంకీ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం నార‌ప్ప‌, ఎఫ్ 3, దృశ్యం 2 రీమేక్ చిత్రాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూడూ సెట్స్ మీదే ఉన్నాయి.