వామ్మో..ఆర్ఆర్ఆర్‌లో మెర‌వ‌డానికి ఆలియా అంత పుచ్చుకుందా?

June 13, 2021 at 7:51 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, చ‌ర‌ణ్‌ అల్లూరి సీతారామరాజుగా క‌నిపించ‌నున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఆలియా భ‌ట్ తొలి తెలుగు చిత్ర‌మిదే. ఈ సినిమాలో ఆలియా పాత్ర నిడివి తక్కువే అయినా.. కీల‌కంగా ఉంటుంద‌ట‌. అయితే పాత్ర చిన్న‌దే అయినా.. ఆలియా మాత్రం భారీ రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంద‌ని ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

దాని ప్ర‌కారం.. ఆలియా ఆర్ఆర్ఆర్ కుగానూ ఏకంగా ఆరు కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌ట‌. ఇక ఆలియాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేక‌ర్స్ కూడా అంత ఇచ్చేందుకు వెనుక‌డ‌గు వేయ‌లేద‌ని టాక్‌. కాగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవ‌గన్, సముద్రఖని, రే స్టివెన్‌సన్, అలిసన్ డోడీ తదితరులు ప్రధాన పాత్రలో క‌నిపించ‌నున్నారు.

వామ్మో..ఆర్ఆర్ఆర్‌లో మెర‌వ‌డానికి ఆలియా అంత పుచ్చుకుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts