5 మిలియన్ ఖాతాలో యంగ్ టైగర్ ..?

నంద‌మూరి మనవుడిగా తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినా కూడా త‌న అభినయం, డ్యాన్స్, పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తూ ప్రేక్షకుల్లో త‌న‌కంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఎటువంటి పాత్ర అయిన అవలీలగా చేసి తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డిగా ఇండ‌స్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ప్ర‌స్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు తారక్. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీంగా క‌నిపించి అల‌రించ‌నున్నాడు. రీసెంట్‌ గా ఎన్టీఆర్‌ కు సంబంధించిన మూవీ పోస్ట‌ర్ ని కూడా విడుదల చేసారు మేకర్స్.

ప్ర‌తి సినిమాకు వైవిద్యం చూపిస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ తాజ‌గా త‌న ట్విట్ట‌ర్‌లో స‌రికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం తారక్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 5 మిలియ‌న్స్‌ కి చేరింది. ఈ సంద‌ర్భంగా అందరు తారక్ కి శుభాకాంక్ష‌లు చెప్తున్నారు. ఎన్టీఆర్ సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా ఉండనప్పటికీ, ఎప్పటికప్పుడు తన మూవీ వివరాలు తెలియచేస్తూ తన ఫాన్స్ ని ప‌ల‌కరిస్తుంటారు తారక్.