మీ స‌హ‌కారానికి సాటిలేదు : సూపర్ స్టార్

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చాలా మంది నర్సులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కరోనా టైంలో కుటుంబానికి దూరంగా ఉంటూ కరోనా రోగులకు సేవల చేస్తున్న వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రశంసిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా నర్సుల దినోత్సవం సందర్భంగా స్పందించారు. కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న న‌ర్సులంద‌రికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

మ‌హేశ్ ట్విట్ట‌ర్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. ఎన్నడూ ఆశను కోల్పోవద్దని మాకు నేర్పించినందుకు.. మీ కరుణ, సానుభూతి, బ‌లంతో ప్రపంచాన్ని స్వస్థత ప‌రుస్తున్నందుకు పెద్ద కృత‌జ్ఞ‌త‌లు..అని ప్రిన్స్ ట్వీట్ లో తెలిపారు. కరోనా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని, ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని అన్నారు. చేతులెత్తి మీ అంద‌రిని కోరుతున్నా..అందరం బాధ్యత వహిస్తూ, ఇంట్లోనే ఉంటూ ప్ర‌భుత్వ లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిద్దాం అంటూ మ‌హేశ్ బాబు ట్విట్ ద్వారా తెలియజేశారు.