టాలీవుడ్ లో సక్సెఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. వరుసగా అనీల్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అనీల్. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబూతో సినిమా చేసాడు. సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ప్రస్తుతం అనీల్ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు.
ఇటీవల మహేష్ తో మరో సినిమా చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. అయితే అనీల్ రావిపూడి, మహేష్ బాబు సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేష్ క్రికెట్ కోచ్ గా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. క్రీడా నేపథ్య చిత్రమిదని తెలుస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ మూవీనే అయినప్పటికీ అనీల్ మార్క్ కామెడీ ఉండనున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు లో మహేష్ ఆర్మీ ఆఫీసర్ అనగానే సీరియస్ యాక్షన్ స్టోరీ అనుకున్నారు. కానీ ఆ తర్వాత అనీల్ మార్క్ వినోదంతో అలరించింది ఈ సినిమా. ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.